రథోత్సవంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడి అభయం

రథోత్సవంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడి అభయం

రథోత్సవంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడి అభయం
ప్రజా క్షేత్ర్, తిరుపతి :
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  ఉదయం 09.00 గం.లకు లకు శ్రీ ప్రసన్న  వేంకటేశ్వరస్వామి వారు రథోత్సవంపై   శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి  విహరించి భక్తులను అనుగ్రహించారు. ఉదయం 7 - 8.30 గం.ల మధ్య పుణ్యాహవచనం, నవగ్రహపూజ చేపట్టారు. తదుపరి 8.41 - 8.55 గం.ల మధ్య రథారోహణం, 8.55- 8.58 గం.ల మధ్య రథాగమనం నిర్వహించారు. 09.00 - 10.30 గం.లకు భక్తజనసమోహం మధ్య రథోత్సవం చేపట్టారు.
సా. 5.30 - 6.30 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహించనున్నారు. రాత్రి 07.00 - 08.00 గం.ల మధ్య అశ్వవాహనంపై స్వామి వారు భక్తులను ఆశీర్వదించనున్నారు.
జూన్ 15న చక్రస్నానం, ధ్వజావరోహణం :  
జూన్ 15 ఆదివారం ఉదయం 08.00- 9.00 గం.ల మధ్య పల్లకీ ఉత్సవం జరుగనుంది. తదుపరి 9.15 - 10.30 గం.ల వరకు స్నపన తిరుమంజనం చేపడుతారు. అనంతరం ఉదయం 10.30 - 10.45 గం.ల వరకు తీర్థవారి చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 4.00- 5.00 గం.ల మధ్య శ్రీవారి మాడవీధి ఉత్సవం జరుగుతుంది. రాత్రి 07.00 - 07.30 గం.ల మధ్య ధ్వజావరోహణతో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.