మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తేదీలు ఖరారు

మేడారం సమ్మక్క-సారలమ్మ  జాతర  తేదీలు ఖరారు

మేడారం సమ్మక్క-సారలమ్మ  జాతర  తేదీలు ఖరారు

ప్రజా క్షేత్ర్, ములుగు జూలై 2 ;: తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ  జాతర  తేదీలు ఖరారు అయ్యాయి. మేడారంలో సమ్మక్కసారాలమ్మ మహా జాతర తేదీలను అక్కడి పూజారుల సంఘం ప్రకటించింది. 2026 జనవరి 28వ తేదీన(బుధవారం) శ్రీ సారాలమ్మ దేవత29న సమ్మక్క దేవతలు (గురువారం) వారివారి గద్దెల మీదకు చేరుకుంటారు. 30వ తేదీన (శుక్రవారం) మొక్కులు చెల్లించుట31వ తేదీన (శనివారం) సమ్మక్కసారలమ్మ వనదేవతలుగోవింద రాజుపగిడిద్దరాజు దేవుళ్లు వన ప్రవేశం చేయడం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పూజారులు నిర్ణయించారు.