మీడియాపై దాడి అనాగరికం - బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు — డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మీడియాపై దాడి అనాగరికం - బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు
— డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
మహా న్యూస్ మీడియా కార్యాలయంపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇది ప్రజాస్వామ్య విలువలను హరిస్తున్న ఘోరమైన చర్య. మీడియా హక్కులను భంగపరిచే ఇలాంటి ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదు. మూకదాడులు చేయడం అనేది శాంతియుతమైన హైదరాబాద్ చరిత్రకు, తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడే చర్య. ఇటువంటి దుశ్చర్యలతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు ఎవరు చేసిన సహించం. సంఘటనకు సంబంధించి అన్ని ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నాను. శాంతి భద్రతలు, ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించడమే మా ప్రభుత్వ బాధ్యతని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.