జూరాల 14 గేట్లు ఎత్తివేత

జూరాల 14 గేట్లు ఎత్తివేత

జూరాల 14 గేట్లు ఎత్తివేత

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 30;

జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. సోమవారం సాయంత్రం వరద ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకుని అధికారులు 14 గేట్లు ఎత్తివేశారు. జూరాల ఇన్‌ఫ్లో లక్షా 26 వేల క్యూసెక్కులు కాగాఔట్‌ఫ్లో 1,20,185 క్యూసెక్కులకు చేరుకుంది. జూరాల పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగాప్రస్తుతం 317.360 మీటర్లకు చేరుకుంది. జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టిఎంసిలు కాగా… ప్రస్తుతం 7.389 టిఎంసిలకు చేరుకుంది.