రాష్ట్ర ఖజానా .. కేసీఆర్ కుటుంబం సంకనాకించింది : జగ్గా రెడ్డి
రాష్ట్ర ఖజానా .. కేసీఆర్ కుటుంబం సంకనాకించింది
కేసీఆర్ రైతు బంధు ఐదు నెలలు పాటు వేస్తే.
రైతులకు రైతు భరోసా 9 రోజుల్లో ..9 వేల కోట్లు వేయడం జరిగింది.
ఫోన్ ట్యాపింగ్ చేసి కేసీఆర్ పీకింది ఏందీ..?
సీఎం రేవంత్ రెడ్డి గుడ్..జగ్గ రెడ్డి
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 26 :
రాష్ట్ర ఖజానా .. కేసీఆర్ కుటుంబం సంకనాకించిందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ రైతు బంధు ఐదు నెలలు పాటు వేస్తే... రైతులకు రైతు భరోసా 9 రోజుల్లో ..9 వేల కోట్లు వేయడం జరిగింది.సీఎం రేవంత్ రెడ్డి ఇస్ గుడ్..అని జగ్గ రెడ్డి కితాబు ఇచ్చారు..మా సీఎం రేవంత్...డిప్యూటీ సీఎం భట్టి లు 9 రోజుల్లోనే రైతు భరోసా వేశారు కేసీఆర్ పాలనకు... కాంగ్రెస్ పాలనకు ఉన్న తేడా ఇదేకరువులో ఉండి కూడా కస్టపడి రైతుల ఖాతాలో కి 9 వేల కోట్లు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పై నిందలు వేస్తున్నారన్నారు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని నాకు పోలీసులు అప్పుడే చెప్పారు.. ఫోన్ ట్యాపింగ్ చేసి కేసీఆర్ పీకింది ఏందీ..? అని జగ్గ రెడ్డి ప్రశ్నించారు.