విశ్వగురువుగా భారత్ మారాలన్నా బీజేపీతోనే సాధ్యం

విశ్వగురువుగా భారత్ మారాలన్నా బీజేపీతోనే సాధ్యం
విశ్వగురువుగా భారత్ మారాలన్నా బీజేపీతోనే సాధ్యం

విశ్వగురువుగా భారత్ మారాలన్నా, వికసిత్ భారత్ సాకారం కావాలన్నా భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. అవినీతికి ఆస్కారం లేని పాలన, అభివృద్ధికి కొత్త నిర్వచనం ఇచ్చే బిజెపికి మరింత బలాన్ని ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం - 2024ని ప్రారంభించడం జరిగింది. అభివృద్ధి, ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పని చేసే బిజెపికి అండగా ఉండేందుకు సభ్యత్వాన్ని స్వీకరించి, పార్టీకి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరుతున్నాను. సభ్యత్వ నమోదు కోసం కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి  అధ్యక్షతన నిర్వహించిన వర్క్ షాప్ లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్​ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కార్యదర్శి విజయ రహత్కర్ గారు, ఓబిసి మోర్చ జాతీయ అధ్యక్షులు, ఎంపి డా. కె. లక్ష్మణ్ , రాష్ట్ర సంఘటన ప్రధన కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.