జల్సాల కోసం మోహన్​ బాబు ఇంట్లో దొంగతనం..నిందితుడు అరెస్ట్​

జల్సాల కోసం మోహన్​ బాబు ఇంట్లో దొంగతనం..నిందితుడు అరెస్ట్​

జల్సాల కోసం మోహన్​ బాబు ఇంట్లో దొంగతనం..నిందితుడు అరెస్ట్​ 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

నటుడు మోహన్​ బాబు ఇంట్లో రూ.10లక్షలు కాజేసి తప్పించుకు తిరుగుతున్న  నిందితుడిని పహాడిషరీప్​ పోలీసులు అదుపులోకి తీసుకుని బుధవారం రిమాండ్​కు తరలించారు. వివరాల లోకి వెళితే... జల్​పల్లిలోని మంచు టౌన్​ షిప్​ కు చెందిన సినీనటుడు మోహన్​బాబు ఇంట్లో గత ఆరు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్​ అనంతపురం జిల్లాకు చెందిన ఎర్ర వంక పల్లి విలేజ్​కు చెందిన వడితె గణేష్​ నాయక్​ (24) హౌజ్​ బాయ్​గా పనిలో చేరాడు. ఈ నెల 22వ తేదీన తిరుపతిలోని ఎం‌బి‌యూ యూనివర్సిటీ నుంచి కార్యదర్శి కిరణ్​కుమార్​ తేజ్​, గణేష్​ నాయక్​లు రూ.10లక్షలను తీసుకుని జల్ పల్లి లోని మంచు టౌన్ షిప్ కు వచ్చారు. అక్కడ  కిరణ్​కుమార్​ తన గదిలో డబ్బులు పెట్టి పడుకున్నారు. మరునాడు ఉదయం లేచి చూసేసరికి అక్కడ రూ.10లక్షలు కనిపించలేదు. వెంటనే సి.సి కెమెరాలు పరిశీలించగా గణేష్​ నాయక్​ తన గదిలోకి వచ్చి వెళ్లినట్టు కనిపించక పోవడంతో పాటు గణేష్​ నాయక్​ కూడా పరారయ్యాడు. వెంటనే జరిగిన విషయాన్ని కార్యదర్శి కిరణ్​ యజమాని మోహన్​బాబుకు జరిగిన విషయాన్ని వివరించారు. దీంతో మోహన్​ బాబు సూచన మేరకు కిరణ్​కుమార్​ ఈ నెల 23వ తేదీన రాత్రి 10గంటలకు పహాడిషరీఫ్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న గణేష్​ నాయక్​ను అదుపులోకి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 7,36,400లక్షలు  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు