బీసీ బిల్లును చట్టం రూపంలో చేసుకొని గవర్నర్ కు పంపించాం : మంత్రి, పొన్నం ప్రభాకర్

బీసీ బిల్లును చట్టం రూపంలో చేసుకొని  గవర్నర్ కు పంపించాం : మంత్రి, పొన్నం ప్రభాకర్

బీసీ బిల్లును చట్టం రూపంలో చేసుకొని  గవర్నర్ కు పంపించాం :
మంత్రి, పొన్నం ప్రభాకర్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

బిఆర్ ఎస్ హయంలో బలహీన వర్గాల తరఫున గొంతెత్తి ఉంటే బీసీల గురుంచి కవితకు మాట్లాడే అర్హత లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజ్యసభ సభ్యులు, బీసీ నేత ఆర్.కృష్ణయ్య అంటే గౌరవమని,
డిల్లీ కి వస్తాం.. మీరు ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోండి అందరం కలిసి వెళదామని చెప్పారు. మీ తమ్ముడిగా రీక్వెస్ట్ చేస్తున్నా ఆర్. కృష్ణయ్య కు
మా నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా బీసీ విజన్ గురించి బల్ల గుద్ది చెబుతున్నారు. కవిత సత్రంలో భోజనం పెడుతుంటే కూడా సిఫార్సు లెటర్ కావాలి అనే రకమని, సన్నాయి నొక్కులు నొక్కితే అర్థమే లేదన్నారు. సీఎం రేవంత్, టీపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నుంచి క్యాబినెట్ వరకు క్లియర్ కట్ గా ఉన్నామని, పదేళ్ల లో బిఆర్ఎస్ బీసీలను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు.
కేసీఆర్ కావొచ్చు ఆయన చుట్టూ ఉన్న దెయ్యాలు కావొచ్చు  ఎవరైనా సరే బీసీల కోసం మాతో కలిసి రావాలని, బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోందన్నారు. బలహీన వర్గాలను పట్టించుకోని కవితతో కూర్చొని మద్దతు గురుంచి కృష్ణయ్య మాట్లాడటం సమంజసం కాదు. బీసీ బిల్లుకి రాజకీయ రంగు పులమడం సబబు కాదు
తెలంగాణలో 56 శాతం బీసీలు ఉన్నారు అన్నది క్లియర్.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ మార్గదర్శకం లో సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీ బిల్లును చట్టం రూపంలో చేసుకొని గవర్నర్ కు పంపించడం జరిగిందన్నారు.