పాతబస్తీ లో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం
పాతబస్తీ లో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం
పాతబస్తీ లో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం
ప్రజా క్షేత్ర్, చార్మినార్ :
పాతబస్తీ లాల్ దర్వాజా మోడ్ నెహ్రూ విగ్రహం వద్ద సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఇంచార్జి కె.వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని, జాతీయ పతకాన్ని ఆవిష్కరించినారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజల అరవై ఏళ్ల సాకారాన్ని నిజం చేసిన సోనియా గాంధీ చిత్రపటానికి వెంకటేష్ పార్టీ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఆరు దశాబ్దాల నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని అన్నారు.రాష్ట్రం ఏర్పడిన అనంతరం అధికారంలో ఉన్న బిఅర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని పేర్కొన్నారు. పదేండ్ల ఆర్ధిక విధ్వంసాన్ని అధిగమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ తరహాలో పాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని వెంకటేష్ అన్నారు.అన్ని కులాలకు వర్గాలకు న్యాయం లభించాలని దేశానికి ఆదర్శంగా నిలిచేలా బీసీ కులగణనను చేపట్టడంతో పాటు బీసీ రిజర్వేషన్లు,ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి చారిత్రాత్మక ఘట్టాలకు తెరతీశారని ప్రశంసించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కె.సురేష్ బాబు, జి.శ్రీనివాస్,నరసింహ,దినేష్ శ్రీవాత్సవ్,హైదర్ అలీ జాఫ్రీ తదితరులు పాల్గొన్నారు.