ఎడ్యుకేషన్ లో దేశంలోనే నెంబర్ వన్ ఉండే విధంగా ప్రభుత్వం చేస్తున్న చర్యలకు తల్లిదండ్రులు సహకరించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

ఎడ్యుకేషన్ లో దేశంలోనే  నెంబర్ వన్ ఉండే విధంగా ప్రభుత్వం చేస్తున్న చర్యలకు తల్లిదండ్రులు సహకరించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

ఎడ్యుకేషన్ లో దేశంలోనే  నెంబర్ వన్ ఉండే విధంగా ప్రభుత్వం చేస్తున్న చర్యలకు తల్లిదండ్రులు సహకరించాలి

మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

తమ పిల్లలను ప్రాథమిక ఉన్నత సాంకేతిక విద్యా అందుకునే విధంగా ప్రోత్సహిస్తూ తెలంగాణ రాష్ట్రం ఎడ్యుకేషన్ లో దేశంలోనే  నెంబర్ వన్ ఉండే విధంగా ప్రభుత్వం చేస్తున్న చర్యలకు తల్లిదండ్రులు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రూపొందిన ప్రజల సహకారం కావాలని, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకొని ఎదిగితే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక విప్లవం వచ్చిందని, ప్రజలకు సౌకర్యాలు పెరిగాయని, సాంకేతిక విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రపంచ స్థాయి కాంపిటీటివ్ స్కిల్స్ ఉండే ఎడ్యుకేషన్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ,యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చాం. తెలంగాణ ప్రభుత్వం టీచర్ల నియామకాలు, బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చింది ఇంటిగ్రేటెడ్ గురుకులాలు తెచ్చింది హాస్టల్ మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచాం

ఎడ్యుకేషన్ కు మా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుంది.

తెలంగాణ యావత్ ప్రజలకు విజ్ఞప్తి.. స్కూల్ డ్రాప్ ఔట్స్ లేకుండా సామాజిక బాధ్యతగా అందరు చదువు అందుకునే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలబడండి

తల్లిదండ్రుల విద్యను అందించేందుకు బాధ్యత గా వ్యవహరించాలి.  ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరూ పర్యావరణాన్ని కాపాడడానికి కృషి చేయాలి. కాలుష్యాన్ని నియంత్రణ చేయడానికి మొక్కలు నాటాలి. పర్యావరణం కాపాడడానికి ప్రతి తెలంగాణ బిడ్డ మొక్కలు నాటడం తో పాటు దానిని కాపాడడానికి విధిగా దినచర్య గా తీసుకోవాలి. రాబోయే కాలానికి సమాజానికి మనం అందిస్తున్న భవిషత్ ఆస్తిగా గమనించాలి. లేదంటే భవిషత్ సమాజం క్షమించదు. ఆక్సిజన్ పెట్టుకొని పోయే పరిస్థితి వస్తుంది. ఢిల్లి మహా నగరంలో నివసించే పరిస్థితి లేదని, హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో కాలుష్యం పెరుగుతుందన్నారు. మొక్కలు నాటడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మొక్కలు నాటడానికి హైదరాబాద్ లో 30 లక్షల పైగా మొక్కలు నాటాలని ప్లాన్ చేస్తున్నామని,మొక్కలు అందు బాటులో ఉన్నాయి ఎక్కడ ఇబ్బంది లేదు. జహీరాబాద్ ప్రజా ప్రతినిధులు కోరితే వారం రోజుల్లో ఏసీ బస్సు వేస్తాం ప్రయాణికులు ఉపయోగించు కోవాలని పేర్కొన్నారు.