ప్రధానమంత్రి సూర్య ఘర్ సు విస్తృత పరచాలి

ప్రధానమంత్రి సూర్య ఘర్ సు విస్తృత పరచాలి

ప్రధానమంత్రి సూర్య ఘర్ సు విస్తృత పరచాలి

ప్రజా క్షేత్ర్, రాయచోటి :

ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం క్రింద 03 కిలోవాట్ల పవర్ కు కేంద్ర ప్రభుత్వం ద్వారా 78 వేల రూపాయల రాయితీ ఇవ్వబడుతుందని, ఒక కిలో వాట్ పవర్ సోలార్ ఇన్స్టాలేషన్ ద్వారా 120 విద్యుత్ యూనిట్ల ఉత్పత్తి జరుగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. బీసీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అదనంగా 20 వేల రూపాయల రాయితీ ఇవ్వబడుతుందని, ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందించే పాలసీ రూపకల్పన జరగనుందని తెలిపారు. గురువారం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విద్యుత్ శాఖ ఎస్ ఈ, ఈఈలు, నెడ్‌క్యాప్ సిబ్బంది, జిల్లాలో సోలార్ ఇన్స్టాల్ చేసే వెండర్లు, ఎంపీడీవోలు, తదితరులతో అన్నమయ్య జిల్లాలో సీఎం సూర్య ఘర్ పథకం అమలుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజిలి యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వారు ఫిబ్రవరి 2024 లో ప్రారంభించారని, ఈ పథకం ద్వారా  ప్రజలు తమ ఇళ్లపై సోలార్ ప్యానల్ ను ఇన్స్టాల్ చేసుకుని సోలార్ విద్యుత్తును వాడుకోవచ్చు అన్నారు. జిల్లా విద్యుత్ శాఖ, సోలార్ పవర్ ఇన్స్టాలేషన్ వెండర్లు మరియు నెడ్కాప్ వారు సమన్వయంగా రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం కింద సోలార్ పవర్ ను ఇన్స్టాల్ చేసుకునే లబ్ధిదారులకు ఏ మేరకు రాయితీ ఇవ్వబడుతుంది మరియు ఇతర అంశాలపై ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా వివిధ అంశాలు పేర్కొన్నారని దానిని ఉపయోగించుకొని జిల్లాలో రిజిస్ట్రేషన్లు చేయించాలని అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ద్వారా లోను తీసుకుని సోలార్ పవర్ ను ఇన్స్టాల్ చేయించుకోవాలనుకునేవారు ఎల్డీఎం మరియు డిఆర్డిఏ లను సంప్రదించే విధంగా ప్రజలకు తెలియజేయాలన్నారు. ఒక కిలోవాట్ సోలార్ పవర్ ను ఇన్స్టాల్ చేసుకుంటే 120 యూనిట్ల వరకు విద్యుత్ ను వాడుకోవచ్చని తద్వారా దాదాపు 640 రూపాయల విద్యుత్ చార్జీ తగ్గుతుందన్నారు. జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ పవర్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకునే రిజిస్ట్రేషన్లు పెరగాలని విద్యుత్ శాఖ సిబ్బందిని, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా సోలార్ విద్యుత్తు అందించే విధంగా ప్రత్యేకంగా నూతన విధానాన్ని తీసుకురానున్నందున బీసీలు మరియు ఓసీల మీద దృష్టి సారించాలని వారి దగ్గర నుండి వీలైనన్ని ఎక్కువ రిజిస్ట్రేషన్లు చేయించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్పీడీసీఎల్ శాఖ ఎస్ ఇ చంద్రశేఖర్ రెడ్డి, ఈఈలు, డీఈలు, ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.ఆవులు దూడలు, ఒంటెల వధ నిషేధం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై జంతు హింస నివారణ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు.  రాయచోటి కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పశుసంవర్ధక శాఖ... "ఆవులు దూడలు, ఒంటెల వధ నిషేధం చట్టరీత్యా నేరం" అనే అంశంపై రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆవులు దూడలు  ఒంటెల వధ నిషేధం అని, ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై జంతు హింస నివారణ చట్టం 1960 ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధము మరియు పశు సంరక్షణ చట్టం 1977ల ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ పిళ్ళై పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చౌక దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీని సక్రమంగా నిర్వహించాలని, తూకాల్లో ఏమాత్రం తేడా వచ్చినా.ఒక్క గ్రాము తగ్గినా కూడా చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులకు సూచించారు.గురువారం పుల్లంపేట మండలం ఎగువ రెడ్డిపల్లి 8ఏ చౌక దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి నిత్యవసర వస్తువుల పంపిణీని పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి.ఈ సందర్భంగా చౌక దుకాణం ఏయే సమయాల్లో నిర్వహిస్తున్నారు, ఆ దుకాణం పరిధిలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఇప్పటివరకు ఎంతమందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు, అలాగే ఆ చౌక దుకాణం పరిధిలో 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఎంతమంది ఉన్నారు, ఇప్పటివరకు ఎంతమందికి ఇంటింటికి డోర్ డెలివరీ చేశారు తదితర వివరాలను కలెక్టర్ ఆరా తీశారు.

ప్రభుత్వం నిర్దేశించిన సమయాలలో ఉదయం సాయంత్రం తప్పనిసరిగా చౌక దుకాణంను నిర్వహిస్తున్నామని, ఆ చౌక దుకాణం పరిధిలో 65 ఏళ్లు పైబడిన వృద్ధులు 37 మంది ఉన్నట్లు తహసిల్దార్ అరవింద కిషోర్ కలెక్టర్ కు వివరించారు. వస్తువుల పంపిణీ సందర్భంగా.. తూకంలో ఏ మాత్రం తేడా రాకూడదని, లబ్ధిదారుకు ఒక్క గ్రాము తక్కువ ఇచ్చినా కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని, అలాగే 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి వద్దకే తప్పనిసరిగా నిత్యావసర వస్తువులను డోర్ డెలివరీ చేయాలని చౌక దుకాణం డీలర్ కు కలెక్టర్ సూచించారు. అనంతరం ఆ చౌక దుకాణం పరిధిలోని అనంతంపల్లిలో  నివసించే 65 ఏళ్లు వయసు పైబడిన కే.వెంకట సుబ్బమ్మ లబ్ధిదారు ఇంటికి వెళ్లి బియ్యం చక్కెరల వస్తువులను స్వయంగా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అందజేశారు.