తెలంగాణ ఉద్యమకారుల నిరసన
తెలంగాణ ఉద్యమకారుల నిరసన
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం జరగలేదని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల మహిళా వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు కోతి మాధవిరెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ నాంపల్లి లోని గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన హామీల మేరకు ఉద్యమకారులకు మోసం చేశారని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడుస్తున్నా మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం రం ఉద్యమకారులను పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
రాహుల్, సోనియా గాంధీ ఇచ్చిన హామీలు మేరకే రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పి మొండి చేయి చూపించారని మండిపడ్డారు.
నాటి తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని, అలాగే సంక్షేమ సంఘంను ఏర్పాటు చేయాలని కోరారు. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు