సింగరేణి ప్రమాద బీమా పథకం దేశానికి ఆదర్శం - ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
సింగరేణి ప్రమాద బీమా పథకం దేశానికి ఆదర్శం
- ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
రామగుండం-1 ఏరియాకు చెందిన సింగరేణి కార్మికుడు పెండ్రి రంజిత్ కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సింగరేణి సంస్థలో అమలవుతోన్న రూ.1.2 కోట్ల ఉచిత ప్రమాద బీమా పథకం కింద వారి భార్య శ్రీమతి లతకు రూ.1.2 కోట్ల బీమా చెక్కు ను మహాత్మా జ్యోతిరావ్ ఫూలే ప్రజా భవన్ లో అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు .త్వరలో కారుణ్య నియామకం కూడా అందిస్తామని భరోసా కల్పించి ధైర్యం చెప్పారు. ఈ పథకం దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు ఆదర్శప్రాయం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు
ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్, ఇతర అధికారులు హాజరయ్యారు.