కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించిన అఘోరి ( Aghora )

కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించిన అఘోరి ( Aghora )

కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించిన అఘోరి ( Aghora ) 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

కుంభమేళాలు, పుష్కరాలలో మాత్రమే అఘోరా( Aghora ) లు ఎక్కువగా కనిపిస్తుంటారు. హిందూ సమాజంలో అఘోరాలను దేవదూతలు గా భావిస్తుంటారు. అయితే ఘోరాలలో పురుషులు మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంటారు. మహిళలను మాత్రం అఘోరీలుగా సంభోదిస్తుంటారు. అయితే మహిళా అఘోరీలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. వాస్తవానికి హిమాలయ మంచు గుహలు, కాశీ లో అఘోరాలు ఎక్కువగా సంచరిస్తూ తపస్సులు చేస్తుంటారు. కానీ ఓ మహిళా అఘోరీ మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ద దేవాలయాలను సందర్శిస్తు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. ఈ నేపధ్యంలోనే సదరు మహిళ అఘోరి కొమురవెల్లిలోని మల్లన్న ఆలయం, కొండ గట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఆలయకమిటీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేయించారు. ఒక్కసారిగా మహిళా అఘోరిని భక్తులు దర్శించుకుని, సెల్ఫీలు దిగారు.