ఆర్టీవో చెక్ పోస్ట్ లో ఏసీబీ అధికారుల తనిఖీలు
ఆర్టీవో చెక్ పోస్ట్ లో ఏసీబీ అధికారుల తనిఖీలు
ప్రజా క్షేత్ర్, కామారెడ్డి :
మద్నూర్ మండలం సరిహద్దు సలాబత్ పూర్ వద్ద రవాణా శాఖ తనిఖీ కేంద్రంపై అర్ధరాత్రి నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల్ సల్లబాత్ పూర్ చెక్ పోస్ట్ వద్ద వాహనదారుల నుంచి ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా వసూలు చేసిన రూ. 92,000/- నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. తనిఖీ కేంద్రంలో విధుల్లో ఉన్న అధికారులు నిద్రిస్తుంటే.. ప్రైవేట్ వ్యక్తులే చెక్ పోస్ట్ ను వారి చేతిలోకి తీసుకొని లారీల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గమనించామన్నారు. పలువురు ప్రైవేట్ వ్యక్తులు పారిపోగా, ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించామని అన్నారు. తనిఖీలు కొనసాగిస్తామని పూర్తి వివరాలు ఉన్నతాధికారులకు నివేదిస్తామని అధికారులు చెప్పారు. ఏసీబీ అధికారులు వచ్చిన సమాచారం తెలుసుకున్న ప్రైవేట్ వ్యక్తులు దూరప్రాంతాలకు పరుగులు తీశారు. పదేళ్ల క్రితం ఇదే తనిఖీ కేంద్రంపై దాడులు నిర్వహించారు. పదేళ్ల తర్వాత మళ్లీ దాడులు నిర్వహించడంతో అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు భయాందోళనకు గురయ్యారు.