టీటీడీ ఉద్యోగులకు 2వేల హెల్మెట్లు పంపిణీ
టీటీడీ ఉద్యోగులకు 2వేల హెల్మెట్లు పంపిణీ
ప్రజా క్షేత్ర్, తిరుమల :
టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో సీవీఎస్వో మురళీకృష్ణ తో కలిసి గురువారం హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని హెల్మెట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇటీవలే 500 హెల్మెట్లు పంపిణీ చేశామని, అమాలాపురానికి చెందిన నిమ్మకాయల సత్యనారాయణ, హైదరాబాద్ కు చెందిన నాగేంద్ర ప్రసాద్ అనే దాతలు విరాళంగా ఇచ్చిన 2 వేల హెల్మెట్లు ప్రస్తుతం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో మరో 7500 హెల్మెట్లు టీటీడీ ఉద్యోగులకు అందిస్తామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరించాలని ఆయన కోరారు.