గోదావరి- కావేరి లింక్ పేరుతో చంద్రబాబు నీళ్లు తరలింపు : ఎమ్మెల్సీ కవిత
గోదావరి- కావేరి లింక్ పేరుతో చంద్రబాబు నీళ్లు తరలింపు
రేవంత్ ప్రభుత్వ మొద్దు నిద్రతో అన్యాయం
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 26 :
గోదావరి- కావేరి లింక్ పేరుతో చంద్రబాబు నీళ్లు తరలిస్తుంటే, రేవంత్ ప్రభుత్వ మొద్దు నిద్రతో అన్యాయం జరుగుతోందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పులను మాజీ సిఎం కెసిఆర్ సకాలంలో చెల్లించారని కవిత తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డికి అవినీతి చక్ర బిరుదు ఇస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..18 నెలల్లోనే రూ. 2 లక్షల కోట్లు రేవంత్ అప్పులు తెచ్చారని, ఆర్ సి సంస్థకు 2024 నుంచి రేవంత్ ప్రభుత్వం కిస్తీలు కట్టడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో రేవంత్ విఫలం అయ్యారని ఎద్దేవా చేశారు. పోలవరంతో భద్రాచలంతో పాటు 5 గ్రామాలకు అన్యాయం జరుగుతున్నా, రేవంత్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 2024జూలై 6న ప్రగతి భవన్ లోఎపి సిఎం చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ తర్వాతనే..బనకచర్ల ప్రాజెక్టు పనులు ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు.