తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గా ఎం.కోదండ రెడ్డి
తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గా ఎం.కోదండ రెడ్డి
ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో
తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గా ఎం.కోదండ రెడ్డి నియమితులైనారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కమిషన్‌కు చైర్మన్‌గా నియమించిన నేపథ్యంలో వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు.