తెలంగాణ బీసీ సంక్షేమ కమిషన్ చైర్మన్‌గా గోపిశెట్టి నిరంజన్
తెలంగాణ బీసీ సంక్షేమ కమిషన్ చైర్మన్‌గా గోపిశెట్టి నిరంజన్
ముఖ్యమంత్రిని కలిసిన బీసీ చైర్మన్, సభ్యులు
తెలంగాణ బీసీ సంక్షేమ కమిషన్ చైర్మన్‌గా గోపిశెట్టి నిరంజన్ నియమితులైనారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. చైర్మన్ నిరంజన్ తో పాటు కొత్తగా నియమితులైన బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్ , తిరుమలగిరి సురేందర్ , బాలలక్ష్మి లు ముఖ్యమంత్రిని కలిశారు. బీసీ కమిషన్‌లకు చైర్మన్‌గా, సభ్యులుగా నియమించినందుకు ఈ సందర్భంగా వారు సీఎంకి కృతజ్ఞతలు తెలియజేశారు.