రేష‌న్ కార్డుల జారీకి ప‌టిష్ట‌మైన కార్యాచ‌ర‌ణ రూపొందించండి రేవంత్​ రెడ్డి

రేష‌న్ కార్డుల జారీకి ప‌టిష్ట‌మైన కార్యాచ‌ర‌ణ రూపొందించండి రేవంత్​ రెడ్డి

రేష‌న్ కార్డుల జారీకి ప‌టిష్ట‌మైన కార్యాచ‌ర‌ణ రూపొందించండి రేవంత్​ రెడ్డి

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో

రేష‌న్ కార్డుల జారీకి ప‌టిష్ట‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  ఆదేశించారు. కొత్త  రేష‌న్ కార్డుల కోసం అక్టోబ‌రు 2 వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించాల‌ని సీఎం సూచించారు. రేష‌న్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాల‌పై ముఖ్య‌మంత్రి స‌చివాల‌యంలో ఉన్నతస్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రేష‌న్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అర్హులంద‌రికీ డిజిట‌ల్ రేష‌న్ కార్డులు ఇవ్వడానికి సంబంధించి క‌స‌ర‌త్తు చేశారు. ఈ అంశంపై త్వ‌ర‌లోనే మ‌రోసారి స‌మీక్ష నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.