కేటిఆర్,కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి : మెట్టు సాయి కుమార్

కేటిఆర్,కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి : మెట్టు సాయి కుమార్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే కేసీఆర్ కు అంత చులకనా?
  * కేటిఆర్,కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
   * ఫిషర్మెన్  కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ డిమాండ్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 3 :
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే కేసీఆర్ కు అంత చులకనా? మాజీ ముఖ్యమంత్రి గా,పార్టీ అధ్యక్షుడు గా కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు ఎందుకు జరపలేదని ఫిషర్మెన్  కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ప్రశ్నించారు.మంగళవారం గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా కేటిఆర్,కేసీఆర్ లు తెలంగాణప్రజలను అవమానించారని బేషరతుగాకేటిఆర్,కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాన్ చేసారు.తెలంగాణ కోసం తల తాకట్టు పెట్టి, చావు నోట్లో తల పెట్టిన అన్న కేసీఆర్ ఎక్కడతెలంగాణ రాష్ట్ర ఉత్సవాలను బిఆర్ఎస్ నాయకులు అవమానించారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ఉత్సవాలకు ఎందుకు ముందుకు రాలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉంటె ఓర్వలేక కొంత మంది నాయకులు విదేశాలలో తిరుగుతున్నారు కేటిఆర్ టెక్సాస్ లో గింటన్ అనే ఊరు మరో  గుంటూరు అంటుండు గుంటూరు పేరు కేటీఆర్ నోట్లో ఎందుకు వచ్చిందిటెక్సాస్ లో తెలంగాణ పరువును కేటిఆర్ బజారున పెట్టిండుతెలంగాణ లో ఏ ప్రాంతం కేటిఆర్ కు కనిపించలేదా?టెక్సాస్ లో తల దాచుకోవడానికి కేటిఆర్ విల్లా కొన్నాడుతప్పు చేస్తే ఇక్కడ దాచుకున్న వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం సెటిల్ చేయడానికి కేటిఆర్ విదేశాలకు పోయిండువిదేశాలలో ఎన్ని చిల్లర వేశాలు వేసినా కూడా ప్రజల ఆశీర్వాదం సీఎం రేవంత్ రెడ్డికి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి కోతల ప్రభాకర్ రెడ్డికి లేదుకొత్త ప్రభాకర్ రెడ్డి సలహాలు,ఆలోచనలు కేటిఆర్ కు బిఆర్ఎస్ నాయకులకు ఇవ్వాలి2023 లో బిఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా వచ్చింది.2028 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా రాకుండా ప్రజలు చూసుకుంటారన్నారు.