రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ ఆర్ కృష్ణయ్య

రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ ఆర్ కృష్ణయ్య

రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ ఆర్ కృష్ణయ్య
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
తూతూ మంత్రంగా బీసీల రిజర్వేషన్లను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టి కాలయాపన చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద 42 శాతం బీసీల రిజర్వేషన్లు అమలుపై ధర్నాను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్న కేంద్రంపై నెట్టి కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా అఖిలపక్ష నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించారా అని నిలదీశారు. ఈ రోజు బిసిల రిజర్వేషన్లపై అలసట వ్యక్తం చేసి కేంద్రం పై రుద్దడం సరికాదన్నారు.  శాసనసభలో బిల్లు ఆమోదం చేసి పార్లమెంటుకు నివేదించి చట్టం చేసినప్పుడే 42 శాతం అమలు అవుతాయని అన్నారు. తమిళనాడులో కూడా ఇలాగే చేస్తే వారికి ఇప్పటివరకు అమలు కాలేదని గుర్తు చేశారు.  ఇప్పటికైనా అన్ని బీసీ సంఘాల నేతలు, అఖిలపక్ష నాయకులు సమావేశమై బీసీల 42 శాతం రిజర్వేషన్లపై గట్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.