చంద్రగిరిలో నలుగురు స్మగ్లర్లు అరెస్టు

చంద్రగిరిలో నలుగురు స్మగ్లర్లు అరెస్టు

చంద్రగిరిలో నలుగురు స్మగ్లర్లు అరెస్టు

15 ఎర్రచందనం దుంగలతో పాటు కారు స్వాధీనం

కారులో అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్న టాస్క్ ఫోర్స్
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
చంద్రగిరి-శ్రీవారిమెట్టు మార్గంలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15 ఎర్రచందనం దుంగలు, రవాణా చేస్తున్న కారును టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా, టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్  అధ్వర్యంలో  డీఎస్పీ  జె. బాలిరెడ్డి మార్గనిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ఎస్ఐ సి. వినోద్ కుమార్ టీమ్ ఆదివారం రాత్రి భాకరాపేట రేంజిలోని నాగపట్ల అటవీ పరిధిలోని శ్రీవారిమెట్టు నుంచి చంద్రగిరి వెళ్లే మార్గంలో వాహనాల తనిఖీ చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున వేగంగా వచ్చిన ఒక కారు పోలీసులను చూసి ఆగిపోయింది. ఇంకా అందులోని వ్యక్తులు కారు దిగి పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పందించి, వారిని చుట్టుముట్టారు. కారులో చూడగా 15 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. పట్టుబడిన వారిని తమిళనాడు వాసులుగా గుర్తించారు. వారిని దుంగలతో సహా తిరుపతిలోని టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు