రూ. 1.50 లక్షల ఎండిఎంఎ డ్రగ్స్ పట్టి వేత..
రూ. 1.50 లక్షల ఎండిఎంఎ డ్రగ్స్ పట్టి వేత..
1.50 లక్షల ఎండిఎంఎ డ్రగ్స్ పట్టి వేత..
బెంగూళూరు నుంచి దిగుమతి.
.
ఉప్పల్‌లో అమ్మకాలు..
21.3 గ్రాముల ఎండిఎంఎ, నిందితుడితోపాటు బైక్ స్వాధీనం..
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం. సైడ్‌గా డ్రగ్స్, గంజాయి అమ్మకాలు చేపడుతూ ఏసీ రంగారెడ్డి ఎన్‌ఫొర్స్‌మెంట్ టీమ్ బి సీఐ సుబాష్ చందర్ అధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో ఎండిఎంఎ డ్రగ్స్‌తోపాటు బైక్ ఒక వ్యక్తిని పట్టుబడ్డాడు. బండ్లగూడ నుంచి నాగోల్ ప్రాంతానికి డ్రగ్స్ రవాణ అవుతున్నాయనే సమాచారం మేరకు ఎన్‌ఫొర్స్‌మెంట్ సీఐ సుబాష్, ఎస్సైలు కె. వెంకటేశ్వర్లు, ఏ.అనిల్ కుమార్ ఆరుగురు సిబ్బంది కలిసి అనంద్‌నగర్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. అనుమానం వచ్చిన బైక్‌ను నిలిపి తనిఖీలు చేపట్టగా బ్యాగులో 21.3 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్‌ను ఉన్నాయి. డ్రగ్స్‌తోపాటు, ఒక బైక్‌ను సెల్ ఫొన్‌ను స్వాధీనం చేసుకొని ఉప్పల్‌కు చెందిన కె. వెంకట్ మోతీ కుమార్‌ను అరెస్టు చేసి ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. పట్టుకున్న డ్రగ్స్‌ను బెంగూళూరును ఒక వ్యక్తి తీసుక వచ్చి ఇస్తాడని, అక్కడ రూ.3 వేలకు గ్రాము చొప్పున కొనుగోలు చేసి ఉప్పల్ ప్రాంతంలో రూ. 5 వేల నుంచి రూ. 6 వేలకు అమ్మకాలు జరుపుతానని నిందితుడు విచారణలో వెల్లడించాడు. పట్టుకున్న డ్రగ్స్ విలువ రూ. 1.50 లక్షలు గా ఉంటుందని అంచనా వేశారు. డ్రగ్స్ పట్టుకున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ బీ టీం సిబ్బందిని ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి,అసిస్టెంట్ కమిషనర్ రంగారెడ్డి ఆర్ కిషన్ ఏఈఎస్ జీవన్ కిరణలు అభినందించారు