తాటికల గ్రామంలో అమానుషం
తాటికల గ్రామంలో అమానుషం
మహిళను వివస్త్రను చేసి..జననాంగంలో జీడిరసం పోసిన గ్రామస్తులు
ప్రజా క్షేత్ర్, హన్మకొండ :
వివస్త్రను చేసి.. జననాంగంలో జీడిపోసినా ఘటన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలం తాటికల గ్రామంలో చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా ధర్మసా గర్ మండలం తాటికాయల గ్రామంలో ఐదు రోజుల కిందట జరిగిన ఓ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తోందం టూ అనుమానం తో కొందరు వ్యక్తులు ఓ వివాహితను వివస్త్రను చేసి జననాంగంలో జీడిరసం పోసి విచక్షణారహితంగా దాడి చేశారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకా రం.. తాటికాయల గ్రామానికి చెందిన ఓ యువతిని పదేళ్ల క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వారికి ముగ్గురు పిల్లలు. అయితే సమీప బంధువైన ఓ వివాహితతో అతను వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. సుమారు పది రోజులు ఆమెతో కలిసి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. దీంతో అతని భార్య స్వగ్రామమైన తాటి కాయలకు వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు ఆ ఇద్దరినీ వెతికి పట్టుకొని ఐదు రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకువచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరికీ గుండు గీయించారు. ఆ మహిళను ఓ మంచానికి కట్టేసి వివస్త్రను చేసారు. జననాంగంపై జీడి రసం పోశారు. 'తప్పు చేశా ను.. క్షమించండి' అంటూ బాధిత మహిళ వేడుకున్నా వినకుండా దాడి చేశారు. జన నాంగంలోనుంచి తీవ్ర రక్తస్రావమవుతున్నా వదల్లేదు. ఆ తరువాత ఆ ఇద్దరినీ ఏం చేశారో ఇప్పటివరకు ఆచూకీ తెలియడం లేదు. ఈ ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీసులకు సమాచారం లేదని తెలిసింది. అసలు ఆ ఇద్దరూ ప్రాణాలతో ఉన్నారో, లేదో తెలియని పరిస్థితి నెలకొంది.