పిల్లలు లేని దంపతులు బంధువుల నుండి చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలి : కలెక్టర్ పమేలా సత్పతి
పిల్లలు లేని దంపతులు బంధువుల నుండి చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలి :
కలెక్టర్ పమేలా సత్పతి
ప్రజా క్షేత్ర్, కరీంనగర్ :
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కు చెందిన రెండు కుటుంబాల్లోని పిల్లలు లేని వారు వారి బంధువులు, రక్తసంబంధీకుల నుండి చట్టబద్ధమైన దత్తత తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దత్తత ఉత్తర్వులను దత్తత తల్లిదండ్రులకు అందజేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ దత్తత కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని అన్నారు. బంధువులు రక్తసంబంధీకుల నుండి దత్తత తీసుకోదలిస్తే జిల్లా పరిషత్ కార్యాలయం లోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం కరీంనగర్ లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డిసిపిఓ పర్వీన్, ఎల్.సి.పి.ఓ రాజు పాల్గొన్నారు.