మావోయిస్టులతో ఎలాంటి చర్చలు జరిపేదే లేదు : హోంమంత్రి అమిత్ షా

మావోయిస్టులతో ఎలాంటి చర్చలు జరిపేదే లేదు :  హోంమంత్రి అమిత్ షా

మావోయిస్టులతో ఎలాంటి చర్చలు జరిపేదే లేదు
 హోంమంత్రి అమిత్ షా .

ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ :

ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు.వర్షాకాలంలో కూడా నక్సల్స్ ఏరివేత కొనసాగుతుందని, మార్చి 2026లోగా నక్సల్స్ ను పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యం అన్నారు. ఆయుధాలు వదలిన వారిని తాము హృదయ పూర్వకంగా స్వాగతిస్తామని తెలిపారు. రెండు రోజుల పర్యటన సందర్భంగా పలు కీలక పనులకు శంకుస్థాపన ఆయన ఈ మేరకు ఛత్తీస్గఢ్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో విష్ణు దేవ్ సాయి ప్రభుత్వం దూసుకు పోతుందని, నక్సల్స్ ఏరివేతలో అతిపెద్ద విజయం సాధించారని అమిత్ షా ప్రశంసించారు. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌ను వేగవంతం చేయడమే కాకుండా, ఎప్పటికప్పుడు దానికి మార్గనిర్దేశం చేస్తూ వస్తుందని తెలిపారు. తాను గత పదకొండు సంవత్సరాలుగా ఛత్తీస్‌గఢ్‌కు వస్తున్నాని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ను అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్ అటల్ నగర్‌లో మూడు నూతన కార్యక్రమాలకు అమిత్ షా ఆదివారం శంకుస్థాపన చేశారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్‌, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ పనులు ప్రారంభించారు. వాటితో పాటు ఎన్‌ఎఫ్‌ఎస్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్, ఛత్తీస్‌గఢ్-ఐహబ్ కూడా ప్రారంభించారు.