నోరు విప్పిన సిరాజ్
నోరు విప్పిన సిరాజ్
దేశవ్యాప్త పేలుళ్ల కుట్ర కేసులో కొనసాగుతున్న విచారణ..!
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
ఉగ్ర కేసులో నిందితుడు సిరాజ్ పోలీసులకు గుట్టు విప్పుతున్నాడు. పోలీసుల విచారణలో వెలుగులోకి కీలక విషయాలు వస్తున్నాయి. సిరాజ్ను పోలీసులు, ఎన్ఐఏ ఐదు రోజులుగా విచారిస్తున్నారు. తన గ్రూపులోని సభ్యుల వివరాలను సిరాజ్ బయటపెట్టాడు. పరారీలో ఉన్న అహిం గ్రూప్కు చెందిన 12మంది సభ్యుల కోసం గాలింపులు మొదలయ్యాయి. 12 మందిని మానవబాంబులుగా తయారుచేశారని అనుమానాలు వస్తున్నాయి. వరంగల్కు చెందిన ఫర్హాన్, యూపీకి చెందిన బారాదర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సిరాజ్, సమీర్
ముంబైకి వెళ్లి 12 మందితో సమావేశమైనట్లు గుర్తించారు. ఆ ముంబై సమావేశం వివరాలు తెలుసుకుంటున్నారు అధికారులు.