ఢిల్లీ లో అట్టహాసంగా ప్రారంభమైన లాల్ దర్వాజా బోనాలు
ఢిల్లీ లో అట్టహాసంగా ప్రారంభమైన లాల్ దర్వాజా బోనాలు
ఉత్సవాలను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ప్రజా క్షేత్ర్, న్యూ ఢిల్లీ :
దేశ రాజధాని ఢిల్లీలో లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.సోమవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. గవర్నర్ బంగారు బోనం ను తలపై పెట్టుకొని పోతరాజుల నృత్య ప్రదర్శన డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఫోటో ఎక్సిబిషన్ ప్రారంభించారు. గవర్నర్ ను ఆలయ కమిటీ చైర్మన్ బి.మారుతీ యాదవ్ సన్మానించారు.కార్యక్రమంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.శశాంక్ గోయల్,ఆలయ కమిటీ కన్వీనర్ జ.అరవింద్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పోసాని సతీష్ ముదిరాజ్,కమిటీ మాజీ చైర్మన్లు కె.వెంకటేష్, కె.విష్ణు గౌడ్,ఎ.మాణిక్ ప్రభూ గౌడ్,ప్రతినిధులు ఎ. చంద్ర కుమార్,ఎ.వినోద్ కుమార్,శేషు నారాయణ తదితరులు పాల్గొన్నారు.