బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూలై 5 :
తెలంగాణ బీజేపీ చీఫ్‌ గా రామచందర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో కిషన్‌రెడ్డి నుంచి రామచందర్‌రావు బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ డీకే ఆరుణ, బీజేపీ ఎమ్మెల్యే లు హాజరయ్యారు. రామచందర్‌రావు తన నివాసం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సరస్వతీ దేవి ఆలయంలో, చారిత్రక చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కిషన్ రెడ్డి నుంచి అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకుంటున్నందుకు గొప్పగా ఉండడంతో పాటు సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు బిజెపి అండగా నిలబడుతుందని రామచందర్ రావు స్పష్టం చేశారు. కొత్త అధ్యక్షుడికి బిజెపి శ్రేణులు అభినందనలు తెలిపారు.