అదిరిపోయిన 'సరిపోదా శనివారం' కలెక్షన్స్
అదిరిపోయిన 'సరిపోదా శనివారం' కలెక్షన్స్
నాని – వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో ‘అంటే సుందరానికీ!’ తర్వాత రూపొందిన చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందింది. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య పవర్ఫుల్ విలన్ గా నటించాడు. టీజర్, ట్రైలర్స్.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఆగస్టు 29న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. సరిపోదా శనివారం’ చిత్రానికి రూ.44.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.45 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.11.15 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.33.85 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.