ఘనంగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్

ఘనంగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్

ఘనంగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

ప్రతిష్టాత్మక “తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2024” వేడుక హైదరాబాద్ హైటెక్స్‌లో కన్నుల పండుగగా సాగింది. అత్యంత వైభవంగా సాగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  పాల్గొని వివిధ విభాగాల్లో ఉత్తమ అవార్డులకు ఎంపికైన ప్రముఖులకు పురస్కారాలను అందించారు.14 ఏళ్లుగా నిలిచిపోయిన ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రజా ప్రభుత్వం పునరుద్ధరించడమే కాకుండా 2014-24 వరకు పదేళ్ల కాలానికి గానూ సినిమా రంగంలో ఉత్తమ అవార్డులతో పాటు చలనచిత్ర వైతాళికుల పేరుతో నెలకొల్పిన ప్రత్యేక పురస్కారాలను కూడా ఈ వేడుక ద్వారా అందించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , తెలంగాణ ఫిల్మ్ డెవల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుల సమక్షంలో ముఖ్యమంత్రి  అవార్డులకు ఎంపికైన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులు, చలన చిత్ర పరిశ్రమలో విశేష కృషి చేసిన ప్రముఖులకు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులను అందజేశారు.ఎన్టీఆర్ జాతీయ ఫిల్మ్ అవార్డును నందమూరి బాలకృష్ణ కి, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డును మణిరత్నంకి, బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డును శ్రీసుకుమార్, నాగిరెడ్డి, చక్రపాణి ఫిల్మ్ అవార్డును అట్లూరి పూర్ణచందర్ రావు , కాంతారావు ఫిల్మ్ అవార్డును విజయ్ దేవరకొండ కి, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డును యండమూరి వీరేంద్రనాథ్ కి, ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్ కి, ఉత్తమ నటి అవార్డును నివేదా థామస్ కి అందజేశారు. ఇవే కాకుండా అనేక విభాగాల్లో అవార్డులను అందజేశారు.ఆస్కార్ అవార్డు గ్రహీతలు చంద్రబోస్, ఎంఎం కీరవాణి లను ఈ వేదికగా ముఖ్యమంత్రి  సత్కరించారు. గద్దర్ జయంతి వేడుకల నిర్వహణలో భాగస్వామ్యం కల్పిస్తూ ప్రభుత్వం తరఫున మూడు కోట్ల రూపాయలకు సంబంధించిన పత్రాన్ని గద్దర్ ఫౌండేషన్ సూర్యకిరణ్ కు అందజేశారు.సినీ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రజాగాయకుడు గద్దర్ పేరిట అవార్డులను పునరుద్ధరించడం పట్ల నటీనటులు, సినీ పరిశ్రమ ప్రముఖులు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.