చిరంజీవి ఆల్ టైమ్ ఫెవరెట్ హీరోయిన్ ఆమెనే
చిరంజీవి ఆల్ టైమ్ ఫెవరెట్ హీరోయిన్ ఆమెనే
ప్రజా క్షేత్ర్, సినిమా
గతంలో తన పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి తను నటించిన హీరోయిన్స్ లో ఆల్ టైం ఫేవరెట్ ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా అసలు విషయం చెప్పుకొచ్చారు. నేను నటించిన హీరోయిన్స్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ కి నేను ఫిదా. హీరోయిన్స్ ఒక్కొక్కరు ఒక్కో విషయంలో ఎక్స్పర్ట్స్. సుమలత హోమ్లి రోల్స్‌కి క్యారఫ్ అడ్రస్. శ్రీదేవి ఓవరాల్ గా పర్సనాలిటీ పరంగా సూపర్. రాధ గురించి చెప్పాలంటే తన డ్యాన్స్ అద్భుతం. సుహాసిని మరో విధంగా గొప్ప. అలా ప్రతి హీరోయిన్ లో ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ కి నేను అభిమానిని. అయితే మహానటి సావిత్రి, జయసుధ, వాణిశ్రీ తర్వాత విలక్షణత కలిగిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే ఆమె రాధిక. ఆమె ఎమోషన్, కామెడీ, క్లాస్, మాస్ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రలోనూ నటించేయగలరు. వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోగలదు. అందుకే నాకు రాధిక అంటే చాలా ఇష్టం అంటూ వివరించారు. అలా చిరు తన ఆల్ టైం ఫేవరెట్ హీరోయిన్ రాధిక అని చెప్పకనే చెప్పేశారు. ఇక చిరంజీవి, రాధికకాంబోలో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. పట్నం వచ్చిన పతివ్రతలు, అభిలాష, దొంగ మొగుడు, న్యాయం కావాలి, ఇలా ఎన్నో సినిమాల్లో ఇద్దరు కలిసి నటించారు. ఇక ఇప్పటికప్పుడు చిరు తన హీరోయిన్స్‌తో గెట్ టు గెదర్ జరుపుతూనే ఉంటారు. ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. సోషియా ఫాంటసీ డ్రామాగా మల్లిడి వసిష్ట డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాల్లో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.