టీయూడబ్ల్యూజే తోనే* *జర్నలిస్టులకు న్యాయం : విరాహత్ అలీ
*టీయూడబ్ల్యూజే తోనే* *జర్నలిస్టులకు న్యాయం*
*-రాష్ట్ర అధ్యక్షులు విరాహత్అలీ*
ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :
సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగి ఉన్న తమ సంఘం నిరంతరం జర్నలిస్టుల సంక్షేమం, మీడియా స్వేచ్ఛ పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తుందని, ఈ సంఘంతోనే తమకు న్యాయం జరుగుతుందనే బలమైన నమ్మకం జర్నలిస్టుల్లో ఉందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ అన్నారు. శనివారం సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన 22 మంది సీనియర్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, 143 సంఘానికి రాజీనామా చేసి, బషీర్ బాగ్ లోని కార్యాలయంలో , విరాహత్ అలీ సమక్షంలో టీయూడబ్ల్యూజే-ఐజేయులో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీలకు, ప్రభుత్వాలకు అనుబంధంగా పనిచేసే సంఘాలు మనుగడ సాధించలేవని, గడిచిన 65 ఏండ్లలో తమ సంఘం ఎన్నో పార్టీలను, ఎన్నో ప్రభుత్వాలను చూసిందని, అయినా ఎప్పుడూ జర్నలిస్టుల గొంతుకగానే పనిచేస్తూ వస్తుందని, అందుకే నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలో వేలాది జర్నలిస్టుల ఆదరాభిమానాలు పొందుతున్నట్లు విరాహత్ అలీ స్పష్టం చేశారు. సంఘ సలహాదారు కె.శ్రీనివాస్ రెడ్డి మీడియా అకాడమీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు నుండే జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై నిమగ్నమై పోవడం అభినందనీయమన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభ్యత్వం జర్నలిస్టుల సంక్షేమం పట్ల సానుకూలంగా ఉందని, త్వరలో వేలాది మంది జర్నలిస్టులతో హైదరాబాద్ లో, భారీ సభను నిర్వహించి, ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో పాటు సమాచార, ఆరోగ్య శాఖల మంత్రులను ఆ సభకు ఆహ్వానించి, జర్నలిస్టుల ప్రధాన సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి.మధుగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నయ్య, హెచ్.యూ.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను కొల్లాపూర్ జర్నలిస్టులు విరాహత్ అలీ దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.