*తెలంగాణ ఫుట్‌బాల్ టీమ్‌కు ముఖ్యమంత్రి అభినందన*
*తెలంగాణ ఫుట్‌బాల్ టీమ్‌కు ముఖ్యమంత్రి అభినందన*
ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :
జూనియర్ బాలుర జాతీయ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో టైర్ 2 విజేతగా నిలిచిన తెలంగాణ జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ అభినందించారు. ప్రఖ్యాత బీసీ రాయ్ ట్రోఫీలో భాగంగా 2024-25 ఏడాదికిగానూ అస్సాం వేదికగా జరిగిన ఫుట్ బాల్ పోటీల ఫైనల్స్ లో మణిపూర్ జట్టుపై విజయం సాధించిన తెలంగాణ జట్టు ఛాంపియన్షిప్ దక్కించుకుంది. దాదాపు 48 ఏళ్ల తర్వాత తెలంగాణ ఈ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫుట్‌బాల్ టీమ్, కోచ్ సయ్యద్ అలీ అక్బర్ అబిది సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి విజయానందాన్ని పంచుకున్నారు.