బీజేపీ నేతల ఒళ్ళంతా కుట్రలు..కుతంత్రాలు* : జగ్గారెడ్డి
బీజేపీ నేతల ఒళ్ళంతా కుట్రలు..కుతంత్రాలు*
బీజేపీ నేతలకు తలకాయ ఉంది కానీ బేజా లేదు
* 26 మందిని కాల్చేంత వరకు కేంద్ర ఇంటలిజెన్స్ ఏం చేసిందో జవాబు చెప్పాలి
* యుద్ధం ఆగినపుడు మోడీ ప్రకటన చేస్తారు అనుకుంటే ట్రంప్ ప్రకటన వచ్చింది
* ర్యాలీ లు ఎందుకు తీస్తున్నారో కిషన్ రెడ్డి బీజేపీ వాళ్లు సిగ్గు అనిపించడం లేదా
* కాంప్రమైజ్ మీరు అయ్యి...మా నాయకుడిని నిందిస్తారా..?
* మోడీ చేసిన తప్పులకు మొఖం ఎక్కడ పెట్టుకుంటారు
* టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, జగ్గారెడ్డి
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 2 :
త్యాగాల కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీ పై లేనిపోనివి మాట్లాడుతున్న బిజెపి నేతలు ఆయనకు భెశరథితూగా క్షమాపన చెప్పాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, జగ్గారెడ్డి డిమాండ్ చేసారు. సోమవారం గాంధీ భవన్లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ పుల్వామా దాడి తర్వాత కేంద్ర లోని . బీజేపీ ప్రభుత్వం షాక్ లో ఉందన్నారు. పుల్వామా దాడి వివరాలు అడిగితే . రాహుల్ గాంధీ ని కిషన్ రెడ్డి...బండి సంజయ్ లు...రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారు . పాకిస్తాన్ మిలిటెంట్లు దేశంలోకి చొరబడి..26 మంది నీ కాల్చి చంపారు . ప్రధాని మోదీ...రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రాహుల్ గాంధీపై విమర్శలు కాశ్మీర్ లోకి ఉగ్రవాదులు వచ్చి పార్క్ లో 26 మందిని కాల్చేంత వరకు కేంద్ర ఇంటలిజెన్స్ ఏం చేసిందో జవాబు చెప్పాలని కిషన్ రెడ్డి...సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ దేశానికి ఇప్పటి వరకు ఎందుకు సమాధానం చెప్పలేదు మీరు నిద్రావస్థలో ఉండి...రాహుల్ గాంధీ పై విమర్శలు చేస్తూ...డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు.దీనికి సమాధానం చెప్పకుండా మాట్లాడితే ప్రతిఘటిస్తాంతప్పులు మీరు చేసి..ప్రతిపక్ష నాయకుడి పై నిందలా..?ఙ్ఞానం ఉండి...అజ్ఞానులు గా మాట్లాడుతున్నారు.యుద్ధం జరుగుతుంటే... పాకిస్తాన్ ను ఓడిస్తారు మోదీ అనుకున్నారు ప్రజలు. సడన్ గా యుద్ధం ఆగిపోయింది అని బ్రేకింగ్ లు వచ్చాయి . మోడీ ప్రకటన చేస్తారు అనుకుంటే ట్రంప్ ప్రకటన వచ్చింది మోడీ యుద్ధం చేయండి మీ వెనక మేము ఉంటాం అని రాహుల్ గాంధీ చెప్పారు . ట్రంప్ ఇండియా..పాకిస్తాన్ యుద్ధం ఆపినట్టు ప్రకటించారు . రాహుల్ గాంధీపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు దేశ ప్రజలకు యుద్ధం ఆగినట్టు మోడీ చెప్పాల్సింది ...ట్రంప్ చెప్పినందుకు మీకు సిగ్గు అనిపించడం లేదా..? అని ప్రశ్నించారు.కాంప్రమైజ్ మీరు అయ్యి...మా నాయకుడిని నిందిస్తారా..?ఎప్పుడైతే ట్రంప్ ప్రకటన చేశాడో... ఇందిరాగాంధీ సోషల్ మీడియా లో తెరపైకి వచ్చారు ట్రంప్ మాటలకు మోదీ తలొగ్గడం ఏంటని ప్రజలు వ్యతిరేకించారు ఇందిరా గాంధీ హయంలో అమెరికా జోక్యం చేసుకునే ప్రయత్నం చేసినా.. ఎవరి జోక్యం అవసరం లేదు అని చెప్పిందిప్రధాని మోడీ.. వాజ్ పాయ్ బర్త్ డే రోజు దేశంలో లేకుండా పాకిస్తాన్ వెళ్లలేదా..?అదే రోజు పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి..నవాజ్ షరీఫ్ తల్లి కాళ్ళు మొక్కలేదా..?వీటికి సమాధానం చెప్పాలి..చెప్పా పెట్టకుండా వాజ్ పాయి బర్త్ డే రోజు పాకిస్థాన్ వెళ్ళడం సమంజసమేనా..?కిషన్ రెడ్డి..సంజయ్ లు దీనికి సమాధానం చెప్పాలని జగ్గ రెడ్డి డిమాండ్ చేసారు. అప్పుడు రాహుల్ గాంధీ గురించి మాట్లాడండి రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరాగాంధీ సాహసం ముందు బీజేపీ నేతలు ఎంత..? మోడీ చేసిన తప్పులకు మొఖం ఎక్కడ పెట్టుకుంటారువాజ్ పాయ్ పార్లమెంట్ లోనే దుర్గా మాత గా పోల్చారు370 ఆర్టికల్ మోడీ తీసేశాడు.. మళ్ళీ ఎందుకు వచ్చింది ఉగ్రవాదంమూడు సార్లు పాకిస్థాన్ ను తిట్టే ప్రధాని అయ్యాడు..26 మందిని చంపినోడు ఎక్కడో తెలుసుకోలేదు.. సిగ్గు అనిపించడం లేదా కిషన్ రెడ్డిబీజేపీ వాళ్లు చేసే ర్యాలీ లు ఎందుకో ట్రంప్ కే తెలియాలితెలంగాణ లో ఉన్న బీజేపీ నేతలకు తలకాయ ఉంది కానీ బేజా లేదు బీజేపీ నేతల ఒళ్ళంతా కుట్రలు..కుతంత్రాలు ఉంటాయి