రక్తదాత ప్రాణాలను కాపాడే వ్యక్తితో సమానం." - డాక్టర్ లిల్లీ మేరి
రక్తదాత ప్రాణాలను కాపాడే వ్యక్తితో సమానం." - డాక్టర్ లిల్లీ మేరి
(రేపు ప్రపంచ రక్త దాతల దినోత్సవం)
ప్రజా క్షేత్ర్, కొడంగల్ జూన్ 12 :
అత్యవసర పరిస్థితుల్లో మరొకరి ప్రాణం పోసేదే రక్తదానం. దీనిని కృత్రిమంగా ఉత్పత్తి చేయడం సాధ్యపడదు. రక్తదానం ఒక పవిత్ర కార్యo. పోయిన ప్రాణాలను మనము ఎలాగో తీసుకురాలేము. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడే ప్రాణాలను ఒక్కోసారి సాటి మనిషి రక్తముతో కాపాడగల ము. ఇది రక్త దానము తోనే సాధ్యం. పుట్టినరోజులు, పెళ్లిరోజులు చేసుకుంటూ బంధుమిత్రులకు విందు ఇవ్వడం కంటే ఇలాంటి రోజులలో రక్తదానం చేయడం గొప్ప సంతృప్తినిస్తుంది. అయితే దురదృష్టవశాత్తు రక్తదానంపై ప్రజలలో ఇంకా సరైన అవగాహన లేదు. ఎన్నో అపోహలు వెంటాడుతున్నాయి. విధి వంచితులకు, క్షతగాత్రులకు, ప్రమాదం బారిన పడి అల్లాడే వారిని బతికించడానికి ఇవ్వాల్సింది రక్తం. ఒకప్పుడు రక్తదానం చేయాలంటే భయపడేవారు. ఇప్పుడు రక్తం ఇవ్వడానికి ముందుకు వస్తుండడం శుభపరిణామం. రాష్ట్రంలో ఎంతోమంది దాతలు రక్త నిధి కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరమైన వారికి రక్తం అందించి ఎంతో మంది అభాగ్యుల ప్రాణాలు నిలుపుతున్నారు. ప్రాణం నిలపడానికి అవసరమైన ఈ రక్తం గురించి చాలామందికి తెలియదు. అసలు రక్తదానం ఎందుకు చేయాలి. రక్తదానం చేయాలంటే ఎవరిని సంప్రదించాలి.
ఎవరు రక్తదానం చేయాలి :
18 నుంచి 65 సంవత్సరాల లోపు ఉండి 45 కిలోల కంటే బరువు ఎక్కువగా ఉన్న ఆరోగ్యవంతులు రక్తదానం చేయవచ్చు. గతంలో రక్తదానం చేసి ఉంటే మూడు నెలల తర్వాత తిరిగి చేయవచ్చును. రక్తపోటు సాధారణ స్థితిలో ఉన్నవారు, గుండె జబ్బులు లేనివారు రక్తదానం చేయవచ్చును. రక్తదానం చేసినా చేయకపోయినా ప్రతి మనిషి రక్తoలోని జీవకణాల జీవిత కాలము నాలుగు నెలలు మాత్రమే. రక్తదానం చేసిన తర్వాత 24 గంటల లోగా ప్లాస్మా ఏర్పడుతుంది. నాలుగు వారాల్లోగా జీవ కణాలు ఏర్పడతాయి.
రక్త మార్పిడి ఎందుకు?
రక్తంలో భాగంగా ఉండే కొన్ని అంశాలు తగ్గిన, శరీరంలో తగినంత రక్తం లేకపోయినా, రక్త మార్పిడి అవసరము. మన రాష్ట్రంలో అత్యవసరంగా రక్తాన్ని ఎక్కించాల్సిన కేసులు ఎక్కువ కావడం గమనార్హం. రక్తం అవసరమైన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి, రక్తహీనతతో బాధపడే వారికి, సికిల్ సెల్, తల సేమియా వంటి జన్యు సంబంధ వ్యాధులకు గురైనప్పుడు రక్తమార్పిడి తప్పనిసరి. తల సేమియా వ్యాధిగ్రస్తులకు హిమోగ్లోబిన్ తయారయ్యే జన్యువులు లోపిస్తాయి. వీరికి ప్రతి 20 రోజులకోసారి రక్త మార్పిడి జరగాలి. సికిల్ సెల్, అనీమియా వ్యాధిగ్రస్తులకు ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారిపోయి రక్తప్రసరానికి ఆక్సిజన్ సరఫరాకు పనికి రాకుండా పోతాయి. కొంతమంది స్త్రీలలో ప్రసవం తర్వాత పోస్ట్ పార్టం హేమరేజ్ అనే సమస్య వస్తుంది. ఫలితంగా రక్తస్రావ సమస్యకు గురవుతారు. అలాంటి వారికి రక్తమార్పిడి అవసరం అవుతుంది.
రక్తము రకాలు:
రక్తంలో నాలుగు గ్రూపులుంటాయి. ఏ, బి, ఓ, ఏబి ఆర్హెచ్ పాజిటివ్ లు, నాలుగు ఓ ప్లస్, ఎ ప్లస్, బి ప్లస్, ఏ బి ప్లస్ లు ఉంటాయి. ఆర్ హెచ్ నెగిటివ్ లు నాలుగు ఓ మైనస్, ఏమైనస్, బి మైనస్, ఏ బి మైనస్ గ్రూపుల వారు. నాలుగు గ్రూపుల వారికి రక్తదానం చేసే అవకాశం
ఉంటుంది. దేశ జనాభాలో రక్తము 1%ఒకటి నుంచి1.5% వరకు అవసరము అవుతుందని సర్వే రిపోర్ట్ లు తెలియజేస్తున్నాయి. కానీ రక్త సేకరణ మాత్రము 0.80% వరకు రక్తాన్ని సేకరిస్తున్నారు. అంటే మన జనాభాలో 0.20% మంది రక్తం దొరకగా మృత్యువాత పడుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. దీనిని బట్టి రక్తదాన ఆవశ్యకత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశ జనాభాలో ప్రతి వంద మందిలో 400 నుంచి 450 మందికి ఓ ప్లస్ రక్తము, 200 నుంచి 250 మందికి ఏ ప్లస్ రక్తము, 200 నుంచి 250 మందికి బి ప్లస్ రక్తము, 70 నుంచి 80 మందికి ఏబి ప్లస్ రక్తము, ఒక శాతం చొప్పున నెగటివ్ గ్రూప్ రక్తము ఉంటుంది.
ఎర్ర రక్త కణాలు:
రక్తంలో 40- 45 శాతం ఉంటాయి. ఊపిరితిత్తుల నుంచి శరీరంలోని కణాలన్నిoటికీ ఆక్సిజన్ తీసుకువెళ్తాయి. తిరిగి కార్బన్డయాక్సైడ్ ను ఊపిరితిత్తులకు మోసుకు వస్తాయి. రక్తము నుంచి వేరు చేసిన తర్వాత 30-35 రోజుల వరకు నిల్వ ఉంటాయి. వ్యాధులు రాకుండా రక్షించేది మాత్రం తెల్ల రక్త కణాలే.
ప్లాస్మా:
రక్తంలో 55 నుంచి 60 శాతం వరకు ప్లాస్మాకణాలు ఉంటాయి. రక్తంలో ఉండే ద్రవరూపము ప్లాస్మా. ప్లాస్మాలో 92 శాతం నీరు, ఏడు శాతం ప్రోటీన్లు, ఒక శాతం ఖనిజాలు ఉంటాయి. దీని రక్తం నుంచి వేరు చేసిన తర్వాత ఒక ఏడాది వరకు నిల్వ చేయవచ్చు.
ప్లేట్లెట్స్ (రక్త కణాలు):
రక్తము గడ్డ కట్టడానికి, వీటి పరిమాణం తగ్గితే రక్తస్రావాన్ని ఆపడం కష్టం. ప్లేట్లెట్స్ కణాలను తీసిన రోజే అవసరమైన వారికి ఎక్కిస్తారు.
క్రయోప్రెసిపిటెట్ (ఫ్యాక్టర్-8):
హిమోఫిలియా ఉన్నవారికి దీనిని ఎక్కిస్తారు. దీనికి గడ్డ కట్టించే స్వభావం ఉంటుంది.
రక్తదానం చేయాలనుకుంటే :
హైదరాబాద్ నగరంలో సుమారు 150 కి పైగా రక్తనిధి కేంద్రాలున్న రక్తనిది సేకరణకు ప్రభుత్వ ఆసుపత్రులలో గల రక్తనిధి కేంద్రాలకుగాని, రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రాలకుగాని, అనుమతి పొందిన రక్త నిధి కేంద్రాలకు మాత్రమే ప్రభుత్వం సేకరణకు అనుమతినిచ్చింది..
రక్తం అవసరమైతే:
రక్తం అవసరమైన వ్యక్తులు నగరంలోని అనుమతి పొందిన రక్తం కేంద్రాల నుంచి రక్తాన్ని తీసుకోవాలి. ప్రభుత్వ, రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగానూ మిగిలిన వ్యక్తులకు ఏ గ్రూపు రక్తం అయినా 1050 రూపాయలకు ఇస్తారు.