తమిళనాడులో స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు..ఇద్దరు విద్యార్థుల మృతి.

తమిళనాడులో స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు..ఇద్దరు విద్యార్థుల మృతి.

తమిళనాడులో స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు..ఇద్దరు విద్యార్థుల మృతి.
కడలూరుసమీపంలో ఘోర రైలు ప్రమాదం
ప్రజా క్షేత్ర్, చెన్నై :
తమిళనాడులోని కడలూర్ సమీపంలో  తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెమ్మన్కుప్పం రైల్వే క్రాసింగ్ వద్ద పాఠశాల విద్యార్థులతో వెళుతున్న వ్యాన్ను రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర దుర్ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులతో కూడిన స్కూల్ వ్యాన్ సెమ్మన్కుప్పం వద్ద రైల్వే ట్రాక్ను దాటుతోంది. అదే సమయంలో వేగంగా వస్తున్న రైలు వ్యాన్ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వ్యాన్ నుజ్జునుజ్జయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను హుటాహుటిన కడలూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నది.