లాల్ దర్వాజా మహంకాళి దేవాలయానికి రంగుల కార్యక్రమానికి శ్రీకారం

లాల్ దర్వాజా మహంకాళి దేవాలయానికి రంగుల కార్యక్రమానికి శ్రీకారం

 లాల్ దర్వాజా మహంకాళి దేవాలయానికి రంగుల కార్యక్రమానికి శ్రీకారం 

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

వచ్చే నెలలో జరగనున్న  బోనాల ఉత్సవాలకు గాను లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయాన్ని  ముస్తాబు చేస్తున్నారు.అందులో భాగంగా శనివారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ కమిటీ ఛైర్మన్ బి. మారుతీ యాదవ్ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి దేవాలయానికి  రంగులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వచ్చే నెల 11 వ తేదీ నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ పూజారి రామకృష్ణ శర్మ, ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు కె.విష్ణు గౌడ్, కె. వెంకటేష్, సిరా రాజ్ కుమార్, కోశాధికారి ఎ.చంద్ర కుమార్, ప్రచార కార్యదర్శి యశ్వంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.