శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉమ్మడి దేవయాల వృత్తిదారుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు

లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉమ్మడి దేవయాల వృత్తిదారుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
మూడవ సారి అధ్యక్షునిగా పేరోజీ మహేష్ కుమార్
ప్రజా క్షేత్ర్, చార్మినార్ :
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఫూల్ బాగ్ లాల్ దర్వాజా ఉమ్మడి దేవయాల వృత్తిదారుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. మూడోసారి అధ్యక్షునిగా పేరోజి మహేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా కొల్లూరు జ్ఞానేశ్వర్, కోశాధికారిగా గట్టు సుదర్శన్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు అనేక పూజలు చేస్తూ సంఘానికి ముందుకు తీసుకెళ్తూన్నమన్నారు.కులవృత్తి సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.