సీతారాం ఏచూరి మృతి దేశ రాజకీయాలకు తీరని లోటు : రేవంత్ రెడ్డి
సీతారాం ఏచూరి మృతి దేశ రాజకీయాలకు తీరని లోటు : రేవంత్ రెడ్డి
ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో
వామపక్ష యోధుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యులు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం పట్ల మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సీతారాం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జాతీయ స్థాయికి ఎదిగిన అతికొద్ది మంది తెలుగువారిలో ఏచూరి గారి ప్రస్థానం ప్రత్యేకమైనదని సీఎం అభిప్రాయపడ్డారు. నాలుగు దశాబ్ధాల ప్రజా జీవితంలో ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని, వారు లేకపోవడం దేశ రాజకీయాలకు తీరని లోటని తన సందేశంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.