సీనియర్ సిటీజన్స్ రైల్వే రాయితీలు ఇవ్వండి

సీనియర్ సిటీజన్స్ రైల్వే రాయితీలు ఇవ్వండి
ప్రధానికి లేఖ
ప్రజా క్షేత్ర్, నరసాపురం :
రైలు ఛార్జ్ లపై సీనియర్ సిటిజన్సుకు రాయితీ పునరుద్ధరించాలని కోరుతూ అఖిల భారత సీనియర్ సిటిజన్సు కాన్ఫెడరేషన్ (AISCON) పిలుపు మేరకు ఈ రోజు నరసాపురం సీనియర్ సిటిజన్సు వెల్ఫేర్ అసోసియేషన్ " పోస్ట్ కార్డ్ టు పి.యమ్ " అనే ఉద్యమం నిర్వహించారు. ఉద్యమం లో భాగంగా నరసాపురం ప్రధాన తపాలా కార్యాలయం వద్ద రాయితీ పునరుద్ధరణ పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రధాన మంత్రి ని కోరుతూ నినాదాలు చేసి అనంతరం ప్రధాన మంత్రి కి రాసిన ఇన్లాండ్ లెటర్ కార్డులు పోస్ట్ మాస్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత సీనియర్ సిటిజన్స్ కార్పొరేషన్ అధ్యక్షులు. సెంట్రల్ కమిటీ మెంబర్ అందే రంగారావు. గౌరవ అధ్యక్షులు పెన్నోచ బాబు శ్రీ .సెక్రెటరీ షేక్ సిలార్ సాహెబ్ .ట్రెజరర్ పీతాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.