అథ్లెట్ జీవాంజి దీప్తికి నజరానా ప్రకటించిన రేవంత్ సర్కారు
తెలంగాణ యువ అథ్లెట్ జీవాంజి దీప్తిని సత్కరించిన రేవంత్ రెడ్డి
అథ్లెట్ దీప్తికి భారీ నజరానా ప్రకటించిన రేవంత్ సర్కారు
గ్రూప్-2 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం
1 కోటి రూపాయల నగదు బహుమానం
వరంగల్‌లో 500 గజాల స్థలం
కోచ్ నాగపురి రమేష్ కి రూ. 10 లక్షలు నగదు బహుమతి
ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :
ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ పారాలింపిక్స్ 2024లో పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ జీవాంజి దీప్తిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్కరించారు. విశ్వ వేదికపై సత్తా చాటిన పారా అథ్లెట్ దీప్తికి గ్రూప్-2 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, 1 కోటి రూపాయల నగదు బహుమానం, వరంగల్‌లో 500 గజాల స్థలం, కోచ్ నాగపురి రమేష్ కి రూ. 10 లక్షలు బహుమతిగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇటీవల పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్ 2024 మహిళల 400 మీటర్ల టీ20 రేసులో జీవాంజి దీప్తి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. పారా అథ్లెట్స్, క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేలా, వారికి అవసరమైన ప్రోత్సాహం అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్ , ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్) చైర్మన్ శివసేనా రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.