అధ్యాపకుడు రోబోలా కాకుండా, సజీవ స్ఫూర్తి తో బోధించాలి : ఆచార్య లింబాద్రి

అధ్యాపకుడు రోబోలా కాకుండా, సజీవ స్ఫూర్తి తో బోధించాలి : ఆచార్య లింబాద్రి

అధ్యాపకుడు రోబోలా కాకుండా, సజీవ స్ఫూర్తి తో బోధించాలి : ఆచార్య లింబాద్రి

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​

విదేశీ విద్యార్థులకు ధీటుగా మన విద్యార్థులు కూడా నిలబడాలన్న సంకల్పంతో, కోవిడ్ సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా బ్రిటీష్ కౌన్సిల్  సహకారంతో యుకె లో 7 విశ్వవిద్యాలయాలు సందర్శించి బికాం ఫైనాన్స్, బిఎ స్పెషల్ కోర్సుల రూపకల్పన చేశామని ఆచార్య లింబాద్రి అన్నారు. సిటీ కళాశాలలో నూతన డిగ్రీ కోర్సులపై అధ్యాపకులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచీకరణ, ఇంటర్నేషలైజేషన్ నేపథ్యంలో అంతర్జాతీయ విద్యాప్రమాణాలతో ఉన్నత విద్యను అందించాలనే సంకల్పంతో ఉన్నత విద్యామండలి కృషి చేస్తున్నదని అన్నారు. అధ్యాపకులు తమ జ్ఞాన పరిధులను విస్తరింప జేసుకోవడానికి, మెరుగైనబోధనా పద్ధతులను సమకూర్చుకోడానికి అధ్యాపకుల శిక్షణా కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. భారతదేశంలో మిగతా రాష్ట్రాలకంటే భిన్నంగా   ఎక్కువమంది విద్యార్థులు ఇంజినీరింగ్, తెలంగాణలో కామర్స్ కోర్సులకు  ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. ఎంతమంది విద్యార్థులు కోర్సును చదివారనేది కాక, ఎంతమంది ఉపాధి అవకాశాలు పొందారు?   ఎంతమంది విద్యావేత్తలుగా మారారు అన్నది ముఖ్యమన్నారు. అధునాతన బోధన, అభ్యసన, మూల్యాంకన పద్ధతుల ద్వారా మరింత నిర్మాణాత్మకంగా పాఠ్యప్రణాలికలోని విలువలను విద్యార్థుల హృదయాల్లో ప్రతిష్టించాలని విద్యార్థుల జీవితాన్ని మార్చే శక్తి అధ్యాపకులకు మాత్రమే ఉందని అన్నారు.కృత్రిమమేధకు ఆకర్షించ బడుతున్న రాబోయే తరాల విద్యాసవాళ్లను  ఎదుర్కొనేలా పాఠ్య ప్రణాళికను రూపొందించమని, ఈ  కోర్సులను, పాఠ్యప్రణాళికలను అధ్యాపకుల సృజనాత్మక బోధనద్వారానే విజయవంత మవుతాయని, వారి విజయమే తెలంగాణ విజయమన్నారు. అధ్యాపకుడు రోబోలా కాకుండా, సజీవ స్ఫూర్తి తో పాఠాలు బోధించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉన్నత విద్యామండలి ప్రవేశపెట్టిన దోస్త్ నేడు భారత దేశంలో అనేక రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు. అనంతరం రాజనీతి శాస్త్ర ఆచార్యులు శ్రీలత మాట్లాడుతూ ఉన్నత విద్యామండలి దార్శనికంగా తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన సంస్కరణలు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యారంగ ముఖచిత్రాన్ని మార్చబోతున్నదని అభిప్రాయపడ్డారు. అనంతరం  ప్రిన్సిపాల్ బాల భాస్కర్ మాట్లాడుతూ ఆచార్య లింబాద్రి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ గా వినూత్న సంస్కరణలు ప్రవేశపెట్టారని, దోస్త్ ను గొప్ప పారదర్శక ప్రక్రియగా తీర్చిదిద్దారని అన్నారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సులకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఇంజనీరింగ్ కాలేజీల్లో లేని వినూత్న కోర్సులను  ప్రవేశపెట్టి, విద్యార్థులు డిగ్రీ కోర్సులను ఎంచుకునేలా చేశారని అన్నారు.