ఎర్రచందనం ముద్దాయిపై పీడీ యాక్ట్
ఎర్రచందనం ముద్దాయిపై పీడీ యాక్ట్
ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న టాస్క్ ఫోర్స్
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
ఎర్రచందనం అక్రమ రవాణాకు చెందిన పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న తమిళనాడుకు చెందిన అజిత్ బాబు ఎలియాస్ అజిత్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు పీడీ యాక్ట్ అమలు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధించడమే కాకుండా, నమోదైన కేసులను నిరూపించే విధంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఇందులొ భాగంగా గత ఐదేళ్లుగా 10కంటే ఎక్కువ కేసుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా వృత్తిగా చేసుకుని, ముఠాగా ఏర్పడి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న అజిత్ బాబు ఎలియాస్ అజిత్ (22)పై పీడీ యాక్ట్ అమలుకు టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు సిఫారసు చేశారు. ఈ మేరకు తిరుపతి జిల్లా కలెక్టరు, జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ , అతనిపై పీడీ యాక్ట్ అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యక్తి ఎర్రచందనం కొల్లగొట్టడుతూ, వన్య మృగాల చట్టాలను ఉల్లంఘించి నేరాలు చేస్తూ ప్రజాజీవనానికి అటంకం కలిగిస్తున్నట్లు గుర్తించారు. పీడీ యాక్ట్ అమలులో భాగంగా నిందితుడిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధకంలో భాగంగా పీడీ యాక్ట్ అమలు చేయడానికి వెనుకాడబోమని టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ హెచ్చరించారు. ఎర్రచందనం కేసుల్లో ఇప్పటికే అనేక మందికి శిక్షలు పడ్డాయని గుర్తు చేశారు. యువత ఎర్రచందనం అక్రమ రవాణాకు ప్రయత్నించి వారి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని చెప్పారు. స్మగ్లర్లకు శిక్ష పడటంతో పాటు వారి ఆస్తులు కూడా జప్తు చేసుకో పడతాయని తెలియజేశారు.