గణేష్​ నిమజ్జనోత్సవాలకు సర్వం సిద్దం : రాష్ట్ర డీజీపీ జితేందర్

గణేష్​ నిమజ్జనోత్సవాలకు సర్వం సిద్దం : రాష్ట్ర డీజీపీ జితేందర్
గణేష్​ నిమజ్జనోత్సవాలకు సర్వం సిద్దం : రాష్ట్ర డీజీపీ జితేందర్

గణేష్​ నిమజ్జనోత్సవాలకు సర్వం సిద్దం : రాష్ట్ర డీజీపీ జితేందర్

25 వేల మందితో భారీ పోలీస్ బందో బస్తు

ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్​

ఈ నెల 17వ తేదీన జరుగనున్న గణేష్​ నిమజ్జనోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్​ తెలిపారు. నిమజ్జనోత్సవాలకు 25 వేల మందిదో భారీ పోలీస్ బందో బస్తును ఏర్పాటు చేస్తున్నమన్నారు. బాలాపూర్ గణేష్ మండపాన్ని తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్, నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, జీహెచ్ ఎంసి కమిషనర్ ఆమ్రపాలి లు సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలాపూర్ గణేష్ నిమజ్జన రూట్ ను బాలాపూర్ నుంచి చార్మినార్ మీదుగా ట్యాంక్ బండ్ వరకు డీజీపీ జితేందర్, నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, జీహెచ్ ఎంసి కమిషనర్ ఆమ్రపాలి లు వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం  డీజీపీ మాట్లాడుతూ బాలాపూర్ గణేషుడి నిమజ్జనం కోసం రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ సీపీ,రాచకొండ సీపీ, జీహెచ్ఎంసి కమిషనర్, కలెక్టర్ లతో కలిసి నిమజ్జనోత్సవ ఏర్పాట్లను పరిశీలించమన్నారు. అన్ని శాఖల సమన్వయంతో గణేష్ నిమజ్జనాలు సక్సెస్ చేస్తామన్నారు. అనంతరం నగర పోలీస్​ కమిషర సీవీ ఆనంద్​ మాట్లాడుతూ సెప్టెంబర్17వ తేదీన గణేష్ నిమజ్జనం కోసం హైదరాబాద్ లో రూట్ ను పరిశీలించినట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు, హై లెవెల్ కమిటీ అంత కలిసి నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నిమజ్జనం రూట్ లో రోడ్ల మరమ్మత్తులు చేయించడంతో పాటు, రోడ్డుగా అడ్డంగా ఉన్న చెట్లు ,వైర్లు తొలిగించారన్నారు.  నిమజ్జనం రోజున 25వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని, అందులో 15వేలు సిటీ పోలీసులు,10వేల మంది ఇతర జిల్లాలనుండి పోలీసులు బందోబస్తులో పాల్గొంటారన్నారు.  ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం 1.30 గంటల లోపు పూర్తి అవుతుందన్నారు. ఉదయం అరున్నర గంటలకే పూజలు అన్ని పూర్తి చేసుకొని గణేష్ విగ్రహాలను ఊరేగింపు కు తరలించేలా చర్యలు చేపడుతామని అన్నారు. 

15వేల మంది ఉద్యోగులు విధుల్లో పాల్గొంటారు : జీ హెచ్ ఎం సి కమిషనర్ అమ్రాపలి

జీహెచ్ ఎం సి ఆధ్వర్యంలో 17,18,19 తేదీల్లో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జీ హెచ్ ఎం సి కమిషనర్ అమ్రాపలి తెలిపారు.15వేల మంది ఉద్యోగులు విధుల్లో పాల్గొంటారన్నారు. 140 స్టాటిక్​ క్రేన్​లు, 295 మొబైల్​ క్రేన్లు సిద్దంగా ఉంచినట్లు చెప్పారు. 102 మినీ టిప్పర్లు, జేసీబీలు, యాక్షన్​ టీమ్స్​ రెడీ చెసినట్లు తెలిపారు. శానిటేషన్, ఈతగాళ్ళు, టాయిలెట్స్, నిమజ్జనానికి వెళ్తున్న వారికి అక్కడక్కడ ఫుడ్ ఏర్పాట్లు కూడా చేసినట్లు వివరించారు. ఇంకా రెండు రోజుల్లో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు.19వ తేదీ ఉదయం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశ ఉందన్నారు.