ఫిట్‌నెస్ లేని బస్సులు రోడ్డెక్కితే సీజ్ చేస్తాం
ఫిట్‌నెస్ లేని బస్సులు రోడ్డెక్కితే సీజ్ చేస్తాం
ప్రజా క్షేత్ర్, చార్మినార్ :
పాఠశాలలు పునః ప్రారంభమైన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించి స్కూల్ బస్సులను తనిఖీ చేస్తున్నామని మోటారు వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. గురువారం పాతబస్తీ లోని పలు ప్రాంతాల్లో స్కూల్స్ బస్సులను తనిఖీ చేసి వాహనాలకు సంబందించిన పూర్తి డాక్యుమెంట్ను పరిశీలించడం జరిగిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడిపితే శాఖ పరంగా చర్యలు తప్పవన్నారు. పరిమితికి మించి వాహనాల్లో విద్యార్థులను తరలించకూడదన్నారు. నిరంతరం స్కూల్ బస్సుల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. బస్సుల కండీషన్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఇన్సూరెన్స్, పర్మిట్, అటెండర్ లేని బస్సులపై కేసులు నమోదు చేస్తామన్నారు. పాఠశాలల యాజమాన్యాలు సైతం రోడ్డు నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించినప్పుడే ప్రమాదాలను అరికట్ట వచ్చాన్నారు. ఒక్క రోజుతోనే కాకుండా నిరంతరం వాహనాల తనిఖీలు కొనసాగుతాయన్నారు.