ఫోన్ ట్యాపింగ్‌లో గాడిద గుడ్డు తప్ప చర్యలు ఉండవు : బీజేపీ ఎంపీ రఘునందన్ రావు

ఫోన్ ట్యాపింగ్‌లో గాడిద గుడ్డు తప్ప చర్యలు ఉండవు : బీజేపీ ఎంపీ రఘునందన్ రావు

ఫోన్ ట్యాపింగ్‌లో గాడిద గుడ్డు తప్ప చర్యలు ఉండవు..
 కాంగ్రెస్, బీఆర్ఎస్ మూలాఖత్ అయ్యాయి : బీజేపీ ఎంపీ రఘునందన్ రావు  
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూన్ 27
 దుబ్బాక ఉప ఎన్నికలతోనే ఫోన్ ట్యాపింగ్ ప్రారంభమైందని.. మొట్ట మొదటిసారిగా తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు  తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని డీజీపీకి అనేక సార్లు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధంలేని కాంగ్రెస్ నాయకులను సిట్ పిలుస్తోందని.. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ అయ్యింది తనదన్నారు. మమ్మల్ని అడిగితే అన్ని వివరాలు ఇచ్చే వాళ్ళమన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో గాడిద గుడ్డు తప్ప చర్యలు ఉండవని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మూలాఖత్ అయ్యాయని విమర్శించారు. ఫిర్యాదు చేసిన తమను సిట్ ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. రోజుకు ఒక్కరిని మాత్రమే విచారణ చేయడానికి ఇదేమైనా డైలీ సీరియలా అని ప్రశ్నించారు. ఆధారాలు ఇచ్చే వాళ్లను పక్కన పెట్టి డైలీ సీరియల్ నడుపుతున్నారని విమర్శలు గుప్పించారు.