భద్రాచలం ఈఓపై దాడి ఖండించిన మంత్రి తుమ్మల

భద్రాచలం ఈఓపై దాడి ఖండించిన మంత్రి తుమ్మల

భద్రాచలం ఈఓపై దాడి ఖండించినమంత్రి తుమ్మల

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

భద్రాచలం రామాలయ ఈఓ రమాదేవిపై, ఏపీలోని పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన భూ ఆక్రమణదారులు దాడి చేయడాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. ఈఓను, ఫోన్‌లో పరామర్శించిన ఆయన ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆలయ భూముల విషయంలో ఇరు రాష్ట్రాలు చర్చించి దేవాలయానికి చెందేలా చర్యలు తీసుకుంటారని, ఆ భూములు దక్కితేనే ఆలయ అభివృద్ధి సాధ్యమని చెప్పారు.