భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు : జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్

భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు : జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్

భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు
జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్
ప్రజా క్షేత్ర్, జగిత్యాల :
 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి
రెవెన్యూ చట్టమని, దీనిని గ్రామలలో రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ ఆన్నారు.బుధవారం జిల్లా లోని ఎండపల్లి,గొల్లపల్లి, వెల్గటూర్ మండలాల్లో తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన  జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించారు.ఈసంధర్భంగా ఎండపల్లి మండలంలోని గొడిశెలపేట్, వెల్గటూర్ మండలంలోని మొక్కరావుపేట్, గోల్లపెల్లి మండలంలోని దట్నూర్ గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని భూ సమస్యలేని రాష్ట్రంగా తీర్చిదిద్దుటకై ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టం–2025 మరియు భూభారతి నియమావళి–2025 అమలుకు సంబంధించి జూన్ 3, 2025 నుండి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేయబడ్డాయిన్నారు.
భూ భారతి రెవెన్యూ సదస్సులు జగిత్యాల జిల్లాలోని  రెవెన్యూ డివిజనల్ లోని అన్నీ మండలాల రెవెన్యూ గ్రామాలలో జూన్ 3, 2025 నుండి జూన్ 20, 2025 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించబడుతున్నాయిని తెలిపారు.ఈ సదస్సులలో అధికారులు గ్రామాల వారీగా సందర్శించి, రైతుల భూ సమస్యలపై దరఖాస్తులను స్వీకరిస్తారు. రైతులు తమ భూ సమస్యల దరఖాస్తులతో పాటు సంబంధిత పత్రాలను సమర్పించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.జగిత్యాల జిల్లాలో జూన్ 3 నుండి జూన్ 20 వరకు జరగబోయే రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ రెవెన్యూ గ్రామాల వారీగా రూపొందించాలని, మరియు అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, ఎండపల్లి, వెల్గటూర్, గోల్లపెల్లి తహసీల్దారులు ఎంపీడీవోలు, రెవెన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.